రైతులకు 24 గంటలు విద్యుత్తును అందించాలి

వానాకాలం కాలం సీజన్ నాట్లు మొదలయ్యాయని 24 గంటల విద్యుత్ అందించాలని జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి అన్నారు  మిర్యాలగూడ డివిజన్ విద్యుత్ కార్యాలయం ముందు నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను ఉద్దేశించి డిఈ వినతిపత్రం అందజేసి ఆయన మాట్లాడుతూ
 తెరాస ప్రభుత్వం అధికారం వచ్చినంక రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్న కేసీఆర్ ప్రభుత్వం రైతులకు కనీసం 12 గంటలు కరెంట్ ఇవ్వకుండా 10 గంటలు కరెంట్ ఇస్తూ ఇచ్చేదాంట్లో సబ్ స్టేషన్ అనీ LC అని ఇలా ఏదొకటి అంటు 3 నుంచి 5 గంటలు కరెంట్ కట్ చేస్తూన్నారు కట్ చేయడం వల్ల నారి మడిలకు,దుక్కి దున్నడానికి సరిగ్గా కరెంట్ ఉండక నీరు అందక  రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది అదేవిధంగా నిన్న విద్యుత్ శాఖ మంత్రి నాగార్జున సాగర్ లో ఎడమ కాలువ విడుదల చేయగా తూములు తెరవకా చిన్న చిన్న కాలువలకు మట్టి పూడికలు తియ్యక కాలువల ద్వారా రైతులు నీరు అందలేక పోతుంది రైతులు వ్యవసాయం చేసే భూములకు కాలువల ద్వారా చివరి వరకు నీరు అందేలా చేయాలన్నారు
కార్యక్రమంలో వేములపల్లి మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగేళ్ల సత్తిరెడ్డి పూసలపాడు సర్పంచి సత్యనారాయణ మాజీ సర్పంచి నాగవెళ్లి మధు ఎన్ ఎస్ యూ ఐ  రాష్ట్ర నాయకులు బొంగర్ల వినోద్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పుట్టల గురువయ్య లడ్డు పొలాగాని వెంకటేష్ గౌడ్ కంచుకుంట్ల  లింగయ్య యాదవ్ పగడాల వెంకన్న ఓబీసీ పట్టణ అధ్యక్షుడు ప్రవీణ్ సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు