రైతులతో కలిసి నాగలి పట్టిన చంద్రబాబు
అనంతపురం: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర జిల్లాలో నాలుగో రోజు కొనసాగుతోంది. తురకలపట్నం నుంచి పాదయాత్రను చంద్రబాబు ఈ ఉదయం ప్రారంభించి విద్యార్థులు , రైతులతో ముఖాముఖి నిర్వహించారు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎల్‌జీబీనగర్ లో రహదారి పక్కన ఉన్న పంటపొలాలను పరిశీలించారు. రైతులతో కలిసి నాగలి పట్టి పొలాన్ని దున్నారు. చంద్రబాబు యాత్రకు రైతుల నుంచి ఆపూర్వ స్పందన లభించింది.