రైతులను ఆదుకోవాల్సిందే 

నల్లగొండ,మే3(జ‌నం సాక్షి): రైతులకు ఎకరానికి రూ.4వేలు ఇస్తామన్న కేసీఆర్‌ మిర్చి పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కేతావత్‌ బిల్యానాయక్‌ డిమాండ్‌ చేశారు.రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ పాలనతో రైతులు, నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు కేజీ టూ పీజీ, రెండు పడక గదుల ఇళ్లు, గిరిజన, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హావిూలను తెరాస ప్రభుత్వం విస్మరించిందన్నారు. నిధులు, నీళ్లు, నియామకాలంటూ ప్రజలకు కళ్లబొళ్లి కబుర్లు చెప్పి నేడు వాటిని గాలికి వదిలేశారన్నారు. డిండి, ఏలేశ్వరం ప్రాజెక్టులకు నిధులు ఖర్చు చేయడం లేదని, కనీసం డీపీఆర్‌ అనుమతులు కూడా పొందలేకపోయారని విమర్శించారు. కనీసం ఒక్క ఎకరానికి కూడా నీరుపార లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కోరారు.