రైతులను పట్టించుకోని ప్రభుత్వాలు
మెదక్,మే31 : ఏ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా రైతులను మాత్రం పట్టించుకోవడం లేదని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు ఆరోపించారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నా వారి హృదయాలుకరగడం లేదన్నారు. రైతులను విస్మరించడం సరికాదని గుర్తించి ప్రభుత్వాలు రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే పండించిన పంటకు గిట్టుబాటు ధరలు రావడం లేదని అన్నారు. రైతులను విస్మరించే ప్రభుత్వాలకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు భారతీయ కిసాన్ సంఘ్ ఆవిర్భవించిందని, సంఘం దృష్టికి రైతులు తమ తమ సమస్యలు తీసుకురావాలని కోరారు. రైతులను ఇబ్బంది పట్టే అధికారులను రోడ్డుపైకి లాగాలని పిలుపునిచ్చారు. అన్నదాతలు లేకుండా ప్రభుత్వాలు మనుగడ సాగించలేవన్నారు.