రైతులు ఆధునిక పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించేల అవగాహన కల్పించాలి – కలెక్టర్
కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్29 (జనంసాక్షి);
శిక్షణలో నేర్చుకున్న విజ్ఞానాన్ని రైతులకు అందించవలసిన బాధ్యత డీలర్ల దేనని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డిప్లమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ రెండో బ్యాచ్ శిక్షణను గురువారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు ఆధునిక పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. డీలర్లు పాటించవలసిన విధివిధానాలను అధికారులు తెలియజేశారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, సహాయ వ్యవసాయ సంచాలకులు రత్న, మండల వ్యవసాయ అధికారులు, 40 మంది ఇన్పుట్స్ డీలర్స్ పాల్గొన్నారు.