రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకే పెట్టుబడి సాయం

బీమా పథకంతో ఇక రైతుకు పూర్తి భరోసా
గ్రామాల్లో రైతు కళ వచ్చిందన్న ఎమ్మెల్యే రామలింగారెడ్డి
సిద్దిపేట,మే18(జ‌నం సాక్షి ): రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకాన్ని చేపట్టిందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి  అన్నారు. రైతుబంధు పథకంతో పాటు రాఉన్న రోజుల్లో రైతుకు జీవితభీమా కూడా కల్పించాలని సిఎం కెసిఆర్‌ సంకల్పించారని నఅ/-నారు. ఇదికూడా తోడయితే ఇక రైతులకు ఎదురే ఉండదని అన్నారు. కాంగ్రెస్‌ తదితర పార్టీలకు పుట్టగతులు కూడా ఉండవన్నారు. శుక్రవారం నాడిక్కడ మాట్లాడుతూ రైతుబంధు పథకం వారం పాటు జాతరాల సాగిందన్నారు. గ్రామాల్లో రైతుల కళ వచ్చిందన్నారు.రైతుల ముఖాల్లో చిరునవ్వు చూడడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమన్నారు. ప్రపంచంలో రైతులకు పెట్టుబడి పథకం ప్రవేశ పెట్టడం ఎక్కడా లేదదన్నారు. ఈ ఘనత కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రైతుబందు పథకంలో భాగంగా పంపిణీ చేస్తున్న చెక్కులను రైతులు కేవలం వ్యవసాయ అవసరాలకే ఉపయోగించుకోవాలని కోరారు. వరి, పత్తి, ఇతర పంటల విత్తనాలు, ఎరువుల కొనుగోలకు పథకం డబ్బులను వినియోగించు కోవాలన్నారు. అప్పుడే పథకం విజయవంతమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాభివృద్ధికి చేపడుతున్న అన్ని పథకాలు పూర్థిస్థాయిలో అమలైతే మన రాష్ట్రం పాడిపంటలు, పసిడిరాసులతో కళకళలాడాలని ఎమ్మెల్యే అన్నారు.  రైతుబంధు పథకంలో రైతులకున్న ప్రతి ఎకరాకు ప్రభుత్వం రూ.8 వేల పెట్టుబడి అందిస్తూ వారికి భరోసా ఇస్తోందని,  పెట్టుబడి అందని పరిస్థితి నుంచి రైతును ఆదుకోవడానికే ఈ పథకాన్ని కేసీఆర్‌ రూపొందించి అమలు చేస్తున్నాడని ఎమ్మెల్యే అన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాక దశాబ్దాల తరబడి పట్నం వలసపోయి కూలీనాలీ చేస్తున్న రైతు కుటుంబాలు ఈ పెట్టుబడి పథకంతో ప్లలెల బాట పట్టి వ్యవసాయం  చేసుకుంటున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వ్యవసాయం ఆగమైందని, దశాబ్దాలుగా చెరువులు మరమ్మతులకు నోచుకోలేదని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కడుతున్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే  ప్రతీ ఎకరాకు నీరందితే దేశంలోనే మన రాష్ట్రం ఆదర్శంగా మారుతుందన్నారు. తెలంగాణలో ప్రతిపక్షాలకు చోటులేదని, వారిది ఆయోమయ పరిస్థితిగా మారిందని అన్నారు.