రైతులు తప్పనిసరిగా ఈ కేవైసి చేయించుకోవాలి-ఏడిఏ సంగీత లక్ష్మి.

 

 

గద్వాల రూరల్ డిసెంబర్ ‌08 (జనంసాక్షి):- ధరూర్ మండల‌ పరిధిలోని చింతరేవుల, ఏమునోము పల్లి గ్రామాలలో రైతు వేదికలో,పంట పొలాలలో రైతులకు ఏర్పాటు చేసిన ఈ కేవైసి మరియు క్రాప్ కటింగ్ పట్ల మండల వ్యవసాయ శాఖ విస్తీర్ణ అధికారి స్వరూప అధ్వర్యంలో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు…ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎడిఎ సంగీత లక్ష్మీ హాజరై మాట్లాడారు… రైతులందరూ ఈ కేవైసీ పూర్తి చేయించుకోవాలన్నారు. రైతులకు సూచనలు సలహాలు వ్యవసాయ అధికారులు ఇవ్వాలన్నారు.. ఈ కేవైసీ చేయించుకొని రైతులు వీలైనంత త్వరగా ఆధార్ నంబర్ కు ఫోన్ నెంబర్ లింక్ చేయించుకొని, ఈ కేవైసి చేయించుకోవాలని,అలాగే ఆయా గ్రామాలలో రైతులు పండించే పంటల క్రాప్ కటింగ్ చేసే విధానం పట్ల,ఏవిధంగా చేతికిచ్చిన పంటను కటింగ్ చేసే పద్ధతులను చింతరేవుల, ఏమునోముపల్లి రైతులకు అవగాహన కల్పించారు..