రైతుల ఆందోళనతో స్తంభించిన రహదారి
పూడూరు: గత రాత్రి నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందంటూ రేగడి మామిడి పల్లకి చెందిన రైతులు గురువారం మన్నెగుడ సబ్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో హైదరాబాద్-బీజాపూర్ అంత్తరాష్ట్ర రహదారి ట్రాఫిక్‌తో స్తంభించింది. పోలీసులు వచ్చి రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.