రైతుల ఆత్మహత్యలపై ప్రసార సాధనాల్లో ప్రచారం నిర్వహించండి

4

కౌంటర్‌ దాఖలు చేయండి

– హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌,నవంబర్‌16(జనంసాక్షి):

రాష్ట్రంలో ఆత్మహత్యల నివారణకు రైతుల్లో భరోసా కల్పించేందుకు పత్రికల్లో, టీవీల్లో ప్రచారం నిర్వహించాలని హైకోర్టు సూచించింది. రైతుల ఆత్మహత్యలపై కోదండరాం వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై కౌంటర్‌ ఎందుకు దాఖలు చేయడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని  ధర్మాసనం ప్రశ్నించించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు రైతు ఆత్మహత్యలపై ఏపీ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది.రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. రైతు ఆత్మహత్యల నివారణకు ఏం చేస్తున్నారో చెప్పాలని రెండు ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఆత్మహత్యల నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారని తెలుగు ప్రభుత్వాలను కోర్టు ప్రశ్నించింది. మరో వైపు రైతు ఆత్మహత్యలపై ఏపీ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టామని ఏపీ తెలిపింది. కౌంటర్‌ దాఖలు చేయాలని టీ ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. టీ ప్రభుత్వం కరవు మండలాలు ప్రకటించలేదని పిటిషనర్‌ పేర్కొన్నారు. దీనిపై జెఎసి ఛైర్మన్‌ కోదండరామ్‌ కూడా కేసు వేసిన సంగతి తేలింది.