రైతుల ఆత్మహత్యల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలి

5

– ప్రొఫెసర్‌ కోదండరాం

హైదరాబాద్‌ అక్టోబర్‌24(జనంసాక్షి):

ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించాలని , రైతుల ఆత్మహత్యల నివారణకు శాశ్వత మార్గాలు అన్వేషించాలని ఆయన పేర్కొన్నారు. జివొ 421 ప్రకారం ఆర్ధిక సాయం అందించాలన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని జేఏసీ చైర్మన్‌ కోదండరాం సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో 20మండలాలల్లోనే అధికంగా జరుగుతున్నాయని తమ సర్వేలో తేలిందని తెలిపారు. రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో జరగిన సర్వేకు సంబంధించిన వివరాలను ఆయన ప్రకటించారు. ప్రభుత్వంతో పాటు తాము కూడా కొన్ని మండలాల్లో చర్యలు చేపడుతామన్నారు కోదండరాం. మార్కెట్‌లు రైతులను దోచుకునే కేంద్రాలుగా తయారయ్యాయని కోదండరామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క తెలిపారు. రుణభారం మోయలేకే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని భట్టి తెలిపారు.  పత్తి రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి తెలిపారు. పత్తి క్వింటాకు రూ. ఐదు వేలు మద్దతు ధర ఇవ్వాలని పొంగులేటి తెలిపారు.