రైతుల ఆత్మహత్య నివారణెళి లక్ష్యం

బీమాతో రైతులకు మరింత భరోసా
సిద్దిపేట,మే28(జ‌నం సాక్షి): రైతులను ఆదుకునే క్రమంలో అనేక కార్యక్రమాలు చేపట్టిన సిఎం కెసిఆర్‌ ఇప్పుడు బీమాతో వారికి ఇక పూర్తి ధీమా కల్పించారని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. దీంతో రైతు కుఉటంబాలనకు భరోసా దక్కనుందన్నారు. దేశంలో రైతుల కోసం ఇంతగా ఆలోచించి అనేక పథకాలతో వారిని అక్కున్న చేర్చుకున్న దాఖలాలు లేవన్నారు. కేవలం తెలంగాణలో మాత్రమే ఇంతగా కార్యక్రమాలు అమలవుతున్నాయని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతులు ఆర్థిక ఇబ్బందులు తుడిచిందని ఎమ్మెల్యే అన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా స్వశక్తితో ఎదిగేలా సిఎం కెసిఆర్‌ కృషఙ చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. వ్యవసాయానికి 24గంటల ఉచిత కరం టు అందిస్తున్నారనీ పేర్కొన్నారు. రైతులను అప్పులబారి నుంచి కాపాడేందుకు రైతుబంధు పథకం చేపట్టారని, ఇలా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా రైతుకు పంటపెట్టుబడి కోసం ఎకరానికి రూ.8వేలు ఇవ్వడం లేదన్నారు. రైతులకు రుణమాఫీ చేయడంతోపాటు సాగుకు ముందే పెట్టబడి అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. భూరికార్డుల ప్రక్షాళన చేపట్టి రైతులకు పైసా ఖర్చులేకుండా నూతన పట్టాదార్‌పాస్‌ పుస్తకాలు అందించారని ఆయన వివరించారు. రైతులకు నాణ్యమైన కరంటు అందిస్తామని హావిూ ఇచ్చి అమలు చేశారని అన్నారు.