రైతుల కోసం ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పై ఉక్కు పాదం మోపండి

రైతుల కోసం ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేసి.. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై ఉక్కుపాదం మోపాలని హైకోర్టు న్యాయవాది అమరేందర్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ని కలిసి కోరారు.ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాది అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ.., దేశంలోని  70 శాతం పైబడి  జనాభా  వ్యవసాయం, వ్యవసాయ  ఆధారిత  రంగాలపై  ఆధారపడి  జీవనం గడుపుతున్నారని..అందులోను చాలా మటుకు  నిరక్షరాస్యులై ఉండటం వలన  రైతన్నలకు తీవ్రంగా  అన్యాయం జరుగుతుందని చెప్పారు. వారికి రావలసిన  పంట నష్టం, ఇన్పుట్ సబ్సిడీ,మద్దతు ధర, సబ్సిడీ వంటి  అనేక  వాటిలో  అన్యాయం  జరుగుతుందని , ఇందులో  అధికారుల నిర్లక్ష్యం, ఇన్సూరెన్స్  కంపెనీల
 సహాయం  లేకపోవటం వలన రైతాంగం తీవ్ర నష్టానికి గురవుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.అందుకే రైతులకు  ప్రత్యేక చట్టాలు  తీసుకు  రావాల్సిన  అవసరం ఉందని  దీనిపై
వ్రాసిన వ్యాసం ఇప్పటికే  అంతర్జాతీయ న్యాయ పరిశోధక  వ్యాస  పత్రికల్లో ప్రచురమైందని మంత్రి నిరంజన్ రెడ్డి కు తెలిపారు.అలాగే  ప్రపంచంలోనే ఆహార  కల్తీలు చేసే విషయంలో మా భారత్ రెండవ పెద్ద దేశంగా ఉండటం ద్వారా  సామాన్య ప్రజలకు, ముఖ్యంగా వృద్దులకు,  చిన్నారులకు,మహిళలకు అనేక రకాలుగా ప్రభావితం చేసి తీవ్ర అనారోగ్యాలకు గురిచేస్తోందని గుర్తు చేశారు.,ఈ  కల్తీ  విత్తనాలనుండి  మొదలుకొని,వినీయోగదారుని  చేరేవరకు  వివిధ  దశల్లో  విపరీతమైన  కల్తీ  జరుగుతుందని వివరించారు.ఇందులో ఉపయోగించే అనేక రకాలైన  కృత్రిమ ఎరువులు,
రసాయనాల ద్వారా  కల్తీ  జరగటం  ద్వారా  క్యాన్సర్ వంటి  రోగాల  బారినా  పడుతున్నారని తెలియజేసారు. పై విషయాల్లో  ఇప్పటికే వ్రాసిన  వ్యాసం కూడా  అంతర్జాతీయ న్యాయ  పరిశోధక  పత్రికల్లో ప్రచురితం  అయ్యిందని తెలియ జేశారు , రైతులకు ప్రత్యేక  చట్టాలు ఏర్పాటుచేసి, ఆహార  కల్తీని  నియంత్రించటానికి  చట్టాలను సవరిస్తూ కల్తీ విత్తనాలు తయారు చేసే వారిపై వారిపై కఠిన  శిక్షలు  అమలయ్యేలా చూడాలని కోరగా మంత్రి నిరంజన్ రెడ్డి సానుకూలంగా స్పందించారనీ ఆనందం వ్యక్తం చేశారు. తమరు సూచించిన విషయాలను పరిశీలించి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళ్లి తమ శాఖాపరంగా తగు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు.
Attachments area