రైతుల పంటలకు 24 గంటల కరెంటు ఇవ్వాలని సబ్ స్టేషన్ ముందు రైతులు ఆందోళన
విద్యుత్ ఏఈ దుర్గా ప్రసాద్ కు వినతి పత్రం అందజేస్తున్న రైతులు
మల్దకల్ జూన్ 18 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పరిధిలోని ఎద్దులగూడెం,చెర్ల గార్లపాడు, పెద్ద దొడ్డి ,శేషంపల్లి,రైతులకు కరెంట్ కోతతో రైతులు నష్టానికి గురవుతున్నారని,24 గంటల కరెంటు ఇవ్వాలని శనివారము రైతులు సబ్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తామని,కేవలం 9గంటల మాత్రమే విద్యుత్ సరఫరాతో సరిపెట్టుకుందిని ఆగ్రహించిన రైతులు సబ్ స్టేషన్ దగ్గరకు చేరుకొని అధికారులతో తో వాగ్వివాదానికి దిగారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటలకు వరకు విద్యుత్ సరఫరా ఉంటుందని,రాత్రి వేళలో కరెంట్ లేకపోవడం వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు అధికారుల ముందు విన్నవించారు. వర్షాలు సకాలంలో పడక వేసిన పంటలుఎండిపోతున్నాయని రైతులను పట్టించుకునే నాధుడే లేరని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మల్దకల్ మండలం లో మాత్రమే విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని,మిగతా మండలాలైన గట్టు,ధరూర్ మండలం 24 గంటల కరెంటు సరఫరా అవుతుందని రైతులు ఆరోపించారు.విద్యుత్ ఏ ఈ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ పై అధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఇందులో మా తప్పేమీ లేదని ఆయన రైతులకు సమాధానం ఇచ్చారు. ఏఈ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళననువిరమించారు. ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేసి ఇకమీదట విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకుంటానని రైతులకు విద్యుత్ అధికారులు హామీ ఇచ్చారు.