రైతుల పొలాలలో కూడా ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు

చౌడాపూర్, ఆగస్టు 13( జనం సాక్షి): స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా రైతులు వరి పొలాలలో వరి నాట్లు వేసుకుంటూ వ్యవసాయ విస్తరణ అధికారి విశ్వనాథ్ ఆధ్వర్యంలో 75వ భారత స్వతంత్ర  వేడుకలు రైతులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో మందిపల్ గ్రామ సర్పంచ్ మఠం ప్రమీల చంద్రశేఖర్, చౌడాపూర్ రైతుబంధు సమితి అధ్యక్షుడు యాదయ్య, టిఆర్ఎస్ యువ నాయకులు రాజశేఖర్, బాలరాజ్ గౌడ్ మరియు రైతులు తదితరులు ఎంతో ఉత్సాహంతో పాల్గొనడం జరిగింది.
Attachments area