రైతుల ప్రయోజనాల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు

రైతుల ప్రయోజనాల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎంపీపీ నెమ్మదిక్షం ,జడ్పిటిసి మామిడి అనిత అంజయ్య అన్నారు. మండల పరిధిలోని అనంతారం. పెన్ పహాడ్  , గ్రామాల్లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం సూర్యాపేట జిల్లా డి, సి, ఓ, శ్రీనివాస్, కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమ శాతం17 లోపు ఉండాలని పూర్తిగా ఆరపెట్టినటువంటి ధాన్యానికి గ్రేడ్ .ఏ.2060 గ్రేడ్ .బి. రకముకు2040 ధర ఉందని అన్నారు. నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని ఆయన అన్నారు. దాన్యం కొనుగోలు విషయంలో ఎటువంటి అవు కతోకలు జరగకుండా ఉండాలని అధికారులకు రైతులకు సూచించారు .ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల కొరకు ప్రభుత్వం  ఐకెపి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఆరబెట్టిన ధాన్యాన్ని తాలు లేకుండా తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ S.D.L.O. బానోతు కృష్ణ, సబ్ రిజిస్టర్ నాగేశ్వరరావు, పిఎసిఎస్ చైర్మన్ లు నాతాల జానకి రామ్ రెడ్డి, వెన్న సీతారాం రెడ్డి, తాసిల్దార్ శేషగిరిరావు, ఏవో కృష్ణ సందీప్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తూముల భుజంగరావు, సర్పంచ్ బైరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ రేవతి పరంధాములు, ఊరుకొండ జానకమ్మ, నాయకులు పొదిలా నాగార్జున, తూముల ఇంద్రసేనారావు, కట్ల నాగార్జున, దాసరి శ్రీను, పిఎసిఎస్ వైస్ చైర్మన్ మామిడి శ్రీనివాస్, డైరెక్టర్స్ బైరెడ్డి రాంరెడ్డి, దొంతగాని శ్రీను, గుండెపురి రవి, సంకరమద్ది పుల్లారెడ్డి, నకిరేకంటి బజార్, ఏ ఈ ఓ. లు జోష్ణ, సంధ్య. సీఈఓ లు ఆలకుంట్ల సైదులు. సోమ్లా నాయక్. సతీష్. వెంకన్న. తదితరులు పాల్గొన్నారు.