రైతుల సంక్షేమం విస్మిరించిన సర్కార్
మెదక్,మే7(జనం సాక్షి):రైతులకు ఎకరానికి నాలుగు వేలు ఇస్తానంటున్న సిఎం కెసిఆర్ ముందుగా వారి సమస్యలపై స్పందించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో 350 మంది వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ఇంత వరకు బాధిత కుటుంబాలను ముఖ్యమంత్రి పరామర్శించలేదని విమర్శించారు. రుణమాఫీకి నాలుగు విడతలుగా నిధులు కేటాయించామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినా .. రుణమాఫీ వడ్డీలకే సరిపోతుందని
ఎద్దేవా చేశారు. బ్యాంకుల్లో బలవంతగా ఉన్న మొత్తాలను లాగేసుకున్న స్పందించడం లేదన్నారు. రైతుల
ప్రభుత్వమని గొప్పలు చెప్పే ప్రభుత్వం.. వారికి రుణాలు ఎందుకు ఇప్పించడం లేదని ప్రశ్నించారు. బ్యాంకర్లను నిలదీయడానికి ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. హైటెన్షన్ విద్యుత్తు తీగలు వెళ్తున్న ప్రాంత రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. గత యాసంగిలో పండించిన ధాన్యం డబ్బులు వానాకాలం వచ్చినా రైతుల జేబుల్లోకి చేరలేదని అన్నారు. ప్రభుత్వాని రైతులంటే చిన్నచూపని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదని… 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోని రావడం ఖాయమన్నారు. కవిూషన్లపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్ర ప్రజల సంక్షేమంపై లేదని ధ్వజమెత్తారు.