రైతు అత్మహత్య

మెదక్‌ జిల్లాలోని దుబ్బాకలో శనివారం ఉదయం విహాదం చోటు చేసుకుంది. అంజయ్య అనే రైతు ఉదయం 7గంటల సమయంలో అత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో అతను అత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయం సహకరించకపోవడంతో దుబాయి వెళ్లిన అంజయ్య ఏజెంట్‌ మోసంతో అక్కడ కూడా పరిస్థితులు అనుకూలించలేదు.ఇండియా తిరిగి వచ్చిన అయన వ్యవసాయం చేసి అప్పులు తీరుస్తారని బాకీ దారులను చెప్పుకోవచ్చు ఈ ఏడాది వర్షాలు సరిగా పడకపోవడంతో పంటలు సరిగా పండలేదు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అంజయ్య అత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యలు తెలిపారు. నవంబర్‌ నెలలో దుబ్బాకలో అత్మహత్య చేసుకున్న రైతుల్లో అంజయ్య నాలుగోవాడు.