రైతు ఆత్మహత్యను నేను గమనించలేదు

2

న్యూఢిల్లీ,ఏప్రిల్‌23: రెండ్రోజుల క్రితం ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా రైతు గజేంద్రసింగ్‌ ఆత్మహత్య ఘటనపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ స్పందించారు. విమర్శలు రావడంతో వివరణ ఇచ్చారు. ఘటన జరిగిన సమయంలో తాను వేదికపై మాట్లాడు తున్నానని, రైతు ఆత్మహత్యకు పాల్ప డుతున్నట్లు తనకెవరూ చెప్పలేదని కేజ్రివాల్‌ వెల్లడించారు. రైతు ఆత్మహ త్య చేసుకున్న చెట్టు వద్ద ప్రజలు గుమిగూడటంతో తాను గమనించలేద ని తెలిపారు. 10 నిమిషాల తర్వాత విషయం తెలుసుకొని రైతును ఆసు పత్రి తరలించినా బతకలేదని కేజ్రివాల్‌ చెప్పారు. రైతు ఆత్మహత్య తర్వాత కూడా ర్యాలీని కొనసాగించడం తప్పేనని కేజ్రివాల్‌ అన్నారు. రెండు రోజుల క్రితం ఆప్‌ ఏర్పాటు చేసిన సభలో గజేంద్రసింగ్‌ అనే రైతు ఆత్మహత్య చేసుకొని మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమ్‌ ఆద్మీ పార్టీ ర్యాలీలో రైతు ఆత్మహత్య చేసుకున్నా ప్రసంగాన్ని కొనసాగించడం తన తప్పే అని ఢిల్లీ సీఎం కేజీవ్రాల్‌ అంగీకరించారు. రైతు గజేంద్రసింగ్‌ ఆత్మహత్యపై స్పందించిన ఆయన ఆ దశలో ఎలాంటి ఆలోచనా రాలేదని దానికి క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. అయితే గత రెండు రోజులుగా రైతు ఆత్మహత్యలపై పార్టీలు చేస్తున్న రాద్ధాంతం సరైంది కాదని కేజీవ్రాల్‌ అభిప్రాయపడ్డారు. దోషులు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలన్నారు.