రైతు ఆత్మహత్యలపై ప్రధాని విచారం

2

న్యూఢిల్లీ  ఏప్రిల్‌ 23 (జనంసాక్షి):  రైతు ఆత్మహత్యలు ఎప్పటినుంచో మనల్ని కలిచివేస్తున్నాయి. రైతు ఆత్మహత్యల సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బాధిత కుటుంబాల బాధలను నేను అర్థం చేసుకోగలను. మనిషి జీవితం కంటే గొప్పది మరేది లేదు. అలాంటి జీవితం కోల్పోతున్న రైతుల సమస్యలు అర్థం చేసుకోవాలన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఒంటరిగా వదిలేయబోమని ప్రధాని హామి ఇచ్చారు. రైతుల ఆత్మహత్యల నివారణకు సూచనలు ఆహ్వానిస్తున్నాంమని పేర్కొన్నారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ రైతులకు అండగా ఉండాల్సిన సమయమిదని అన్నారు. వచ్చిన సలహాలు, సూచనలు విశాల హృదయంతో స్వీకరిస్తామని తెలిపారు. అందరం రైతుల కోసం పాటుపడతామని అన్నారు. రైతు ఆత్మహత్యల సమస్యకు పరిష్కారం కనుక్కోవాలన్నారు. బాధిత కుటుంబాల బాధలను తాను అర్థం చేసుకోగలనని ప్రధాని అన్నారు. ఈ సమస్య చాలా విస్తృతమైనదని, అనాదిగా కొనసాగుతున్న దౌర్భాగ్యమని ప్రధాని పేర్కొన్నారు. ఇదిలావుంటే  దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద భూసేకరణ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఆప్‌ చేపట్టిన ర్యాలీ సందర్భంగా ఓ యువ రైతు చెట్టుకు ఉరేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ రైతు కుటుంబానికి ఆప్‌ రూ. 10 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ విూడియాకు తెలిపారు. ఎదురుగా ఉన్నా కాపాడలేకపోయారని ఆప్‌ని విూడియా తప్పు పడుతోందని, అయితే ఏం జరిగిందన్న విషయం విూడియా కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యిందని ఆయన తెలిపారు.