రైతు ఆత్మహత్యలపై హైకోర్టు సీరియస్‌

1

హైదరాబాద్‌,డిసెంబర్‌1(జనంసాక్షి):

రైతు ఆత్మహత్యలపై ఏపీ,తెలంగాణ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని  ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించింది. ఆత్మహత్యలపై తక్షణ స్పందన లేదన్న రీతిలో కోర్టు స్పందించింది.  రైతు ఆత్మహత్యలపై దాఖలైన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ్టసిస్‌ దిలీప్‌ బి.భోసలే, ఎస్‌.వి.భట్‌లతో కూడి ధర్మాసం విచారణ చేపట్టింది. రైతుల ఆత్మహత్యలు పూర్తిగా ఆగిపోవాలన్నదే తమ ఉద్దేశమని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరపు న్యాయవాదులు… ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను కోర్టుకు వివరించారు. పథకాలు బాగానే ఉన్నాయి కానీ సరిపోవని హైకోర్టు అభిప్రాయపడింది.  అవినీతి కూడా రైతుల ఆత్మహత్యలకు కారణమవుతోందని, అలాంటి అధికారులపై కఠినంగా వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 3 రోజుల్లోగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ అంశాలన్నింటిపై కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. కాగితాలపై ఉన్న పథకాలు రైతులకు చేరుతున్నాయా అని కోర్టు ప్రశ్నించింది. పథకాల వివరాలు, వాటిని పొందే విధానాలపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించింది. ఆత్మహత్య చేసుకున్న వెంటనే సాయం అందేలా చూడాలని పేర్కొన్నారు. కోదండరాం సూచనలు బాగున్నాయని, అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తెలిపింది. అధికారుల అవినీతి కూడా రైతుల ఆత్మహత్యలకు కారణమవుతోందని, అవినీతి అధికారులను సస్పెండ్‌ చేయాలని న్యాయస్థానం సూచించింది.  ఈ సందర్భంగా హైకోర్టు ఇరు ప్రభుత్వాల తీరుపై తీవ్రంగా స్పందించింది. ఈ విషయంపై స్పందించిన ఏపీ, తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు రైతుల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.ప్రభుత్వ పథకాలపై కరపత్రాలు ముద్రించి ప్రతి రైతుకు చేరవేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రొ.కోదండరాం సూచనలు బాగున్నాయని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వివరించింది. ప్రధానంగా అధికారుల అవినీతి కూడా రైతుల ఆత్మహత్యలకు కారణమవుతోందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అవినీతి అధికారులకు గుణపాఠం చెప్పాల్సిందే. అవినీతి అధికారుల పట్ల కఠినంగా ఉండాలని, అవినీతి బయటపడగానే అధికారిని సస్పెండ్‌ చేయాలని ఆదేశించింది. ప్రభుత్వాలు ఇచ్చిన నివేదికలపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇన్ని పధకాలు ఉన్నా, క్షేత్రస్థాయిలో అమలు అవుతున్నాయా అన్న సందేహం వ్యక్తం చేసింది.ఆత్మహత్యలు చేసుకోకుండా రైతులకు అవగాహన పెంచాలని కోరింది.