రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు స్థిరపడాలంటే అవసరం ఎంతో ఉంది.
అదనపు కలెక్టర్ భాస్కరరావు.
నల్గొండ బ్యూరో జనం సాక్షి.
రైతు ఉత్పత్తి దారుల కంపెనీ లు ఆర్ధికంగా నిలదొక్కుకోవాలంటే ఈక్విటీ గ్రాంట్,క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్ ఎంత గానో ఉపయోగపడతాయని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. ఈ రెండు స్కీంల ద్వారా రుణం పొందే అవకాశాన్ని జిల్లాలో ఉన్న రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు వినియోగించుకొని, బలోపేతం కావాలని ఆయన కోరారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో స్మాల్ ఫార్మర్స్ ఆగ్రి కన్సార్టియం (ఎస్.ఎఫ్.ఏ.సి) సహకారముతో ఏ .ఎఫ్.సి ఆధ్వర్యములో నల్గొండ జిల్లా లో రైతు ఉత్పత్తిదారుల కంపెనీ , వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు , బ్యాంకు అనుబంధ సంస్థలు, సి.బీ. బి. ఓ లకు ఈక్విటీ గ్రాంట్, క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్స్ ఫై నిర్వహించిన అవగాహనా కార్యక్రమము లో అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత మాట్లాడుతూ ఎఫ్ పి ఓ లు అభివృద్దికి గాను వ్యవసాయ శాఖ సహకారం ఉంటుందని తెలిపారు ప్రతి వ్యవసాయ విస్తరణ, మండల వ్యవసాయ అధికారులు రైతు ఉత్పత్తిదారుల కంపెనీల సమావేశాలకు హాజరై వారికి వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన సలహాలు సూచనలు అందించాలని కోరారు. నాబార్డు డి డి ఎం వినయ్ కుమార్ మాట్లాడుతూ మాట్లాడుతూ మన జిల్లాలో సెంటర్ సెక్టార్ స్కీం కింద నాబార్డు సహకారముతో సుస్థిర వ్యవసాయ కేంద్రం వారు 2 ఎఫ్ పి ఓ లు ఏర్పాటు చేయగా, వివిధ స్థానిక ఎన్ జి ఓ ల ద్వారా 22 ఎఫ్ పి ఓ లు పి ఓ డి ఎఫ్ ఐడి కింద ఏర్పాటు చేయగా వాటికి నాబార్డు పూర్తి సహకారము అందిస్తున్నట్లు తెలిపారు. రైతు ఉత్పత్తిదారుల ప్రతినిధులు వారి సమస్యలను అనుభవాలను అధికారుల దృష్టికి తెస్తూ వారి నుండి సహకారం తీసుకోవాలని కోరారు . జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రమిక్ మాట్లాడుతూ బ్యాంక్ ల నుండి ఎఫ్ పి ఓ లకు రుణాలు అందేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్య్రమానికి ఏ.ఎఫ్.సి అధికారి ప్రసన్న పది, రిసోర్స్ పర్సన్ నాగబ్రహ్మచారి, అగ్రికల్చర్ అధికారి శ్రీ మురళి, మండల వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు, ప్రతినిదులు, ఫపో ప్రతినిదులు మరియు రైతులు పాల్గొన్నారు
2 Attachments • Scanned by Gmail