రైతు కేంద్రంగా రూపొందించిన జాతీయ రైతు విధానాలపై కుమార స్వామి గౌడతో సమావేశమైన సి.ఐ.ఎఫ్.ఏ ప్రతినిధులు
కోటగిరి సెప్టెంబర్ 11 జనం సాక్షి:-జాతీయ రైతు సంఘాల సమాఖ్య(CIFA) ప్రతినిధులు రైతు కేంద్రీకృత విధానాలపై ఆదివారం రోజున కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార్ స్వామి గౌడకి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా జాతీయ రైతు సంఘాల సమాఖ్య చీఫ్ అడ్వైజర్ పెద్దిరెడ్డి చెంగల్ రెడ్డి నేతృత్వంలో ప్రాంతీయ పార్టీల జాతీయ రైతుల ఎజెండా రూపకల్పనలో రైతు కేంద్రకంగా రూపొందించుకున్న ప్రధానాంశాలు కుమార్ స్వామి గౌడనీ కలిసి వివిధ అంశాలపై చర్చించారు.ఈ వినతి పత్రంలో తెలిపిన ముఖ్యాంశాలు.ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను కేంద్ర ఉప ప్రధాని నేతృత్వంలో ప్రవేశ పెట్టాలనీ. వ్యవసాయ ఉత్పత్తుల అన్నిటి పై జీ.ఎస్.టి ఉపసంహరించాలని.డా.యం.ఎస్ స్వామినాథన్ రిపోర్టును అమలు చేయాలని పంట నష్టపరిహారాన్ని అందించుటకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సమగ్ర పంటల బీమా అమలు చేయాలని.డబ్లు.టి.ఓ తో చేసుకున్న ఒప్పందాలను రైతు క్షేమం దృష్ట్యా సమీక్షించాలని.ఉద్యోగస్తుల వార్షిక ఆదాయంతో సమానమైన ఆదాయం రైతులకు వచ్చే విధంగా విధానాల రూపకల్పన చేయాలని.ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ రద్దు చేయాలి.వ్యవసాయ యాంత్రీకరణకు ట్రాక్టర్లు హార్వెస్టర్ లకు జీఎస్టీ ని ఉపసంహరించాలని. ఎరువులు పురుగు మందుల పై జిఎస్టి ని ఉపసంహరించాలని.ఉపాధి హామీ పథకంలో వ్యవసాయానికి50% ఇచ్చుట వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ వినతి పత్రం అందజేతలో జాతీయ రైతు సంఘాల సమాఖ్య తెలంగాణ అధ్యక్షులు శ్రీ సోమ శేఖర్ రావు,తెలంగాణ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి,జాతీయ రైతు సంఘాల సమాఖ్య సలహాదారు శ్రీనివాస్ కుమార్ స్వామి పాల్గొన్నారు.