రైతు దీక్షతొ మళ్లీ యాక్టివ్‌ కానున్న మోత్కుపల్లి

నల్గొండ,నవంబర్‌16(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లాలో మరోమారు టిడిపి కార్యక్రమానలు విస్తృతం చేసి సత్తా చాటాలని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు యోచిస్తున్నారు. గవర్నర్‌ పదవి వస్తుందని ఆశించిన ఆయన గతకొంత కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఇప్పట్లో ఇక గవర్నర్‌ పదవి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో మళ్లీ క్రియాశీకలంగా మారాలని యోచిస్తున్నాన్నారు. దీంతో సమస్యలపై ప్రజల్లో ఉండాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 20న సోమవారం మోత్కుపల్లి ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్‌ ఎదుట రైతు దీక్ష పేరుతో ఆపార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేయనున్నారు. పత్తి, వరి పంటలకు మద్దతు ధరతో పాటు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.6 లక్షల తక్షణ పరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తూ నల్గొండ కలెక్టరేట్‌ ఎదుట మోత్కుపల్లి ఒక రోజు దీక్ష చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, మాజీ మంత్రి, సీనియర్‌ నాయకురాలు ఉమామాధవరెడ్డి తదితరులు హాజరుకానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ ఏర్పడిన 35 ఏళ్ల కాలంలో.. ప్రస్తుతం ఎన్నడూ లేనంత సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నామని… ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణలో పార్టీని నిలుపుకొంటామని మోత్కుపల్లి నర్సింహులు వెల్లడించారు.నల్గొండ, సూర్యాపేట జిల్లాల అధ్యక్షులతో పాటు పలువురు నియోజకవర్గ ఇన్‌ఛార్జులు ప్రతిపక్ష కాంగ్రెస్‌, అధికార తెరాసలో చేరిన తర్వాత నిర్వహించనున్న కార్యక్రమం కావడంతో పార్టీ నాయకులు జనసవిూకరణపై దృష్టి సారించారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ పట్టున్న ఆలేరు, భువనగిరి, కోదాడ, మిర్యాలగూడ నుంచి కార్యకర్తలను తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజావార్తలు