రైతు బీమాపై అవగాహన
సిద్దిపేట,జూన్8(జనం సాక్షి): నంగునూర్ మండల కేంద్రలో రైతు జీవిత భీమా పథకం గురించి రైతు సమన్వయ కమిటీ సభ్యులకు అవగాహనా సదస్సు నిర్వహించారు ఎంపీపీ జప శ్రీకాంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని అన్నారు. అందరు గ్రామంలో ఉన్న రైతు ఇంటికే వెల్లి రైతులకు భీమా చేయాలన్నారు. రైతు నామిని పేరు వారి ఆధార్ , బ్యాంకు ఖాతా నెంబర్,బ్యాంక్ రాసుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ సరయ్య, తదితరులు పాల్గొన్నారు.