*రైతు రాజు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
లంపూర్ ఎమ్మెల్యే వి యం అబ్రహం*. *అలంపూర్ రూరల్ జూన్ 24 ( జనంసాక్షి ) *. రైతును రాజు చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని తమది రైతు ప్రభుత్వం అని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. అలంపూర్ పట్టణంలో అధికారులు శుక్రవార జోగులాంబ లిప్ట్ ప్రారంభోత్సవ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ వి యం అబ్రహం పాల్గొని లిఫ్టును ప్రారంభించారు.
ఈ సందర్భంగాఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ
నేడు ముందస్తుగా జోగులాంబ లిఫ్ట్ ను ప్రారంభం చేసినందుకు రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. ఈలిప్ట్ ద్వారా దాదాపు 3200 ఏకరాలకు సాగునీరు అందుతుందని రైతులు లాభసాటి పంటలు పండించాలని ముఖ్యంగా అలంపూర్ నియోజకవర్గంలోని
రైతులకు నీరు అందించాలనే ఉద్దేశ్యంతో తుమ్మిళ్ల లిఫ్ట్ ప్రారంభం చేయడం జరిగిందని ఇంకా జులకల్ రిజర్వాయర్, మల్లమ్మ కుంట రిజర్వాయర్, వల్లూర్ రిజర్వాయర్లను కూడా త్వరలో ముఖ్యమంత్రి తో మాట్లాడి పూర్తిచేసి అలంపూర్ నియోజకవర్గం రైతులకు నీరు అందించడానికి కృషి చేస్తానన్నారు.
ఏరాష్ట్రంలో చేయని విధంగా రైతుల కోసం రైతు బందు, రైతు బీమా, రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మనోరమ , వైస్ చైర్మన్ శేకర్ రెడ్డి , పిఎసిఎస్ చైర్మెన్ మోహన్ రెడ్డి , వడ్డేపల్లి జెడ్పీటీసీ కశపోగు రాజు , లిఫ్ట్ చైర్మెన్ విజయ్ రెడ్డి , మాజీ ఆలయ కమిటీ ఛైర్మెన్ నారాయణ రెడ్డి , మాజీ ఎంపీపీ సుదర్శన్ గౌడ్ , మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ లక్ష్మణ , టౌన్ అధ్యక్షుడు వెంకట్రామయ్య శెట్టి , మండల పార్టీ అధ్యక్షుడు బీచుపల్లి యాదవ్ ,మాజీ టెంపుల్ ఛైర్మెన్ జితేందర్ గౌడ్ , ఉప అధ్యక్షడు నర్సన్ గౌడ్ ,ఉండవల్లి మండల అధ్యక్షుడు రమణ , ఇ ఇ విజయ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..