రైతు సంక్షేమం కోసంమే రైతు బీమా

సంగారెడ్డి,జూన్‌18(జ‌నం సాక్షి): ఆరుగాలం కష్టపడే రైతు అకాల మరణం పొందితే రైతు కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందని జిల్లా వ్యవసాయాధికారి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న రైతుబీమా పథకం…రైతు కుటుంబాలకు భరోసా కల్పించనుందని అన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, రైతు బీమా పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. రైతులు ప్రమాదవశాతు, సాధారణ మరణం చెందిన వారి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందే విధంగా ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని రూపొందించిందన్నారు. ఈ పథకం 18 నుంచి 60 ఏండ్ల లోపు ఉన్న రైతులందరికీ వర్తిస్తుందన్నారు. ఆగస్టు 15కు ఈ పథకం అమల్లోకి వస్తుందని, అప్పటి వరకు రైతుల వివరాలను సేకరించి, ఎల్‌ఐసీ పత్రాలను పూర్తి చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. రైతుబంధు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామంలోని 18-60 ఏండ్లు నిండిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. రైతు బీమాకు దరఖాస్తు చేసుకునే రైతు ఆధార్‌కార్డు, నామినీ ఆధార్‌ కార్డు జిరాక్స్‌ పాస్‌ ఫొటోలు తీసుకురావాలన్నారు. ప్రతి ఒక్క రైతు బీమా కోసం వారి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించే రోజు తప్పనిసరిగా హాజరై దరఖాస్తులు చేసుకోవాలన్నారు. రైతులందరికీ సీఎం కేసీఆర్‌ రూ.5 లక్షల జీవిత బీమా చేయడం జరుగుతుందన్నారు. ప్రతి రైతుకు ప్రభుత్వమే రూ.2,271 బీమా ప్రీమియం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. రైతు సహజ మరణమైనా సరే రైతు కుటుంబానికి బీమా అందుతుందన్నారు. ఈ పథకం కోసం స్థానిక వ్యవసాయశాఖ సిబ్బంది దరఖాస్తు ఫారాలను గ్రామ సభలలోనే పూర్తిచేస్తారని వివరించారు. రైతుల నుంచి నామినీ ప్రతిపాదిత పత్రాలు సేకరించి స్థానిక వ్యవసాయ విస్తరణధికారుల ద్వారా ఎల్‌ఐసీ కార్యాలయానికి అందిస్తామని స్పష్టం చేశారు. ఆగస్టు 15 నుంచి రైతులకు ఎల్‌ఐసీ బీమా సర్టిఫికెట్లను అందిస్తామన్నారు.ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషిచేస్తుందని తెలిపారు. రైతులు వారి పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్‌లతోపాటు నామినీ ఆధార్‌కార్డు జిరాక్స్‌లను అధికారులకు అందించాలన్నారు. రైతుల బీమా దరఖాస్తులను ఆయా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి తీసుకుంటామని రైతులు వారిపత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.