రైతు సంక్షేమాన్ని కూడా అడ్డుకుంటారా?
రాజన్న సిరిసిల్ల,సెప్టెంబర్ 13,(జనంసాక్షి): రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసమే రైతు సమన్వయ కమిటీల ఏర్పాటు అని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన రైతు సమన్వయ సమితి సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. దేశంలోనే తొలిసారిగా రైతు సమన్వయ సమితిలు ఏర్పాటు చేశామని తెలిపారురాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని 8 రాష్ట్రాల నాయకులు చూసి వెళ్లినా.. కాంగ్రెస్ నేతలకు అర్థం కావడం లేదని కోపోద్రిక్తులయ్యారు కేటీఆర్. తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు సరిపోయే నాయకుడు ఎవరూ లేరని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. రైతు కమిటీలను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్షాలకు కోర్టు చివాట్లు పెట్టిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు ఏది చెప్పినా నమ్మే స్థితిలో ప్రజలు లేరన్న మంత్రి.. రైతులంతా తమ పక్షానే ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరివ్వడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నీటితో ప్రతి ఎకరాకు నీరిందిస్తామన్న మంత్రి.. అదే లక్ష్యంతో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందని ఉద్ఘాటించారు. . గత 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నారని పేర్కొన్నారు. అన్ని చెరువుల మరమ్మతుల లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. రూ. 1024 కోట్లతో 17 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు.