రైతు సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు
వారికి భవిష్యత్ లేదన్న పైళ్ల
యాదాద్రి భువనగరి,జూన్6(జనం సాక్షి):ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రైతుబంధు,రైతుబీమా, నిరంతర విద్యుత్ పథకాలతో తెలంగాణలో రైతులకు తిరుగులేకుండా పోయిందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. అలాగే కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బని అన్నారు. అందుకే వారు 2లక్షల రుణమాఫీ అంటూ చ,ఏస్తున్న ప్రకటనలను ఎవరు కూడా పట్టించుకోవడం లేదన్నారు. వారు చేస్తున్న ప్రకటన ఆచరణ సాధ్యం కాకపోగా, గతంలో పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఈ పథకాలతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఖతం కానుందని అన్నారు. రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక నిధులు వెచ్చిస్తున్నారన్నారు. గతంలో ఇలా కార్యక్రమాలు జరిగిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ఎన్నడూ ఇలా చేయలేదన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారని తెలిపారు. సాగునీరు కోసం బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లు నిర్మాణం కాబోతున్నాయన్నారు. సబ్బండ కులాల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. గొల్ల కుర్మలు ఆర్థికంగా ఎదుగాలన్న సంకల్పంతో సబ్సిడీపై గొర్రెలు, ఏడాది పాటు ఉచిత దాణాను అందిస్తున్నారన్నారు. గీత కార్మికులు, మత్స్య కార్మికులు, చేనేత కార్మికులకు రూ.5లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నారన్నారు. ఈ సంఓఏమ అభివృద్ద ఇకార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేకులు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. గత కొంత కాలంగా నియోజక వర్గంలో పార్టీలో చేరేవారి సంఖ్య పెరిగిందన్నారు. గత పాలకులు చేయని అభివృద్ధిని టీఆర్‌ఎస్ పాలనలో చేసి చూపిస్తున్నామన్నారు. ప్రతి పక్షాలు ఇప్పటికైనా అభివృద్ధికి సహకరించాలన్నారు.