రైలు కిందపడి బావ, మరదలు ఆత్మహత్య!
మెదక్ (జహీరాబాద్) : పెద్దలు ప్రేమను అంగీకరించకపోవడంతో రైలు కిందపడి బావ, మరదలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా జహీరాబాద్- బీదర్ రోడ్డు సమీపంలో గల రైల్వే ట్రాక్ వద్ద మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రాయకోడ్ మండలం కుస్నూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి, వీరమణిలు వరుసకు బావామరదళ్లు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. కానీ వీరి వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో మంగళవారం రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. వీరమణి ఇటీవలే ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేయగా, ప్రభాకర్ రెడ్డి సంగారెడ్డి బస్ డిపోలో అప్రంటీస్‌గా పనిచేస్తున్నాడు. అనుమానాస్పదగా కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.