రైల్వేజోన్‌కు కేంద్రం అనుకూలం
– ఏపీకి ఇచ్చిన హావిూల అమలుకు మోదీ కట్టుబడి ఉన్నారు.
– 85శాతం హావిూలను అమలుచేశాం
– మిగిలిన హావిూలు ఈ ఏడాది పూర్తిచేస్తాం
– చంద్రబాబు తీరును ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు
– బీజేపీ ఎంపీ హరిబాబు
విశాఖపట్నం, మే25(జనంసాక్షి) : విభజన తర్వాత ఏపీ అభివృద్ధి చెందిందని, రైల్వే జోన్‌కు కేంద్రం అనుకూలంగా ఉందని ఎంపీ హరిబాబు అన్నారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ ఏపీకి ఇచ్చిన హావిూల అమలుకు మోదీ కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఇప్పటికే 85 శాతం హావిూలను అమలు చేశామని, మిగిలిన హావిూలను ఈ ఏడాదిలో అమలు చేస్తామని ఎంపీ స్పష్టం చేశారు. విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. విభజన చట్టంలోలేని వాటిని కూడా మోదీ అమలు చేశారని ఎంపీ హరిబాబు తెలిపారు. ప్రత్యేక ¬దాకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన కేంద్రం రూ.43వేల కోట్ల నిధులను ఐదేళ్లలో ఇస్తామని ముందుకు వచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రానికి కేటాయించిన మిగిలిన అభివృద్ది కార్యక్రమాలు, ప్రాజెక్టులకు ఇది అదనమని వివరించారు. ఏపీకి ఇంత సాయం చేస్తున్న కేంద్రం పట్ల ప్రజల్లో టీడీపీ తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. కేంద్రం ఇచ్చిన హావిూలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తుందని, ఇది అందరికీ తెలిసిన సత్యమేనన్నారు. అయినా తెదేపా నేతలు అనవసరంగా కేంద్రంపై వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు నిర్ణయాలు తెదేపా క్యాడర్‌ను ఇబ్బందులకు గురిచేసేదిలా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ వైపు తెలుగుదేశం పార్టీ దారి మళ్లుతోందని బీజేపీ ఎంపీ హరిబాబు విమర్శించారు. దీన్ని ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గ్రాఫ్ తగ్గుతుంది అనేది కేవలం భ్రమేనని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో ఎన్డీయే గెలిచి మళ్లీ నరేంద్రమోదీ ప్రధానమంత్రి అవుతారని హరిబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల కర్నాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒకరినొకకు పరామర్శించుకోవడంతో హరిబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.