రైల్వేలైన్ల మధ్య టిఫిన్‌బాక్స్‌లో బాంబు
మడికొండ (వరంగల్): వరంగల్ జిల్లా ఖాజీపేట-స్టేషన్‌ఘన్‌పూర్ రైల్వే లైన్ల మధ్య మూడు టిఫిన్ బాక్సుల్లో బాంబులు పెట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు రైల్వే రక్షకదళాలు, సివిల్ పోలీసులు గాలింపు చేపట్టగా మడికొండ శివారులోని కుమ్మరిగూడెం రైల్వేట్రాక్ పక్కన టిఫిన్‌బాక్స్ లభ్యమైంది. టిఫిన్‌బాక్సులో బాంబును గమనించిన పోలీసులు దానిని నిర్వీర్యం చేశారు. మిగతా రెండింటి కోసం గాలింపు చేపట్టారు.