రైల్వేస్టేషన్లో మృతదేహం లభ్యం

విశాఖపట్నం : స్థానిక రైల్వేస్టేషన్లో ప్లాస్టిక్‌ సంచుల్లో లభ్యమైన మృతదేహం కేసులో పోలిసులు దర్యాప్తు ప్రారభించారు. రెండు సంచుల్లో  11 ముక్కలుగా దొరికిన అవయవభాగాలపై దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతలలోని రాయపూర్‌ ప్రాంతవాసిగా భావిస్తున్నారు. దీంతో ఈ కేసులో తదుపరి దర్యాప్తు కోసం రాయపూర్‌ ఎస్పీని విశాఖ పోలీసులు కలిశారు.