రైల్వే బ్రిడ్జి అండర్ ప్రాసెస్ పనులను పరిశీలించిన ఎంపి
సంగారెడ్డి,ఆగస్ట్18(జనం సాక్షి): పటాన్‌చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ కొల్లూరు వేలిమెల ఈదులనాగులపల్లి ప్రాంతాలలో మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆయా శాఖ అధికారులు రైల్వే అండర్ పాసింగ్ బ్రిడ్జిల నిర్మాణం మంజూరు అంశాలపై అధికారులతో కలిసి సాద్యాసాద్యాలపై పరిశీలన చేశారు. అదే విధంగా ఈదుల నాగుల పల్లిలో రైల్వే టెర్మినల్ నిర్మాణం విషయంలో స్థల పరిశీలన కోసం ప్రజాప్రతినిధులు అధికారులు పర్యటన చేశారు. ముఖ్యంగా 50 గ్రామాల ప్రజల సౌకర్యార్థం రైల్వే అంటూ ప్రాసెసింగ్ బ్రిడ్జి నిర్మాణం అవసరం ప్రభుత్వం గుర్తించిందని త్వరలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులను ప్రారంభించినట్లు మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు.. అనంతరం సందిగూడెం , ఘనపూర్ లలో హరితహారంలో భాగంగా చెట్లను నాటారు.