రైస్ మిల్లర్ల నిర్లక్ష్యంతో ధాన్యం లారీలు సకాలంలో ఖాళీ కావడం లేదని కిష్టాపూర్ సొసైటీ చైర్మన్ నాగుల గారి మల్లేశం గౌడ్
జనం సాక్షి కొల్చారం మండలం కిష్టాపూర్లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి సక్రమంగా లారీలు రాక ధాన్యం కొనుగోలు నత్త నడకన సాగుతుంది. చాలా రోజులపాటు వరి ధాన్యం కుప్పల వద్ద ఉంటున్న రైతులకు తిప్పలు తప్పడం లేదు. వరి ధాన్యం తూకం కాకపోవడంతో నెలల కొద్ది టార్పాలిన్ల కిరాయి వేల రూపాయలు అవుతుంది. కేంద్రానికి లారీలు రావాలంటే బస్తాకు 10 నుంచి 15 రూపాయలు ఇస్తే గాని రావడం లేదు. దీంతో కిష్టాపూర్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగడం లేదు. ఈ విషయమై సొసైటీ చైర్మన్ నాగుల గారి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు కేంద్రానికి లారీలు పంపించడంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కిష్టాపూర్ కేంద్రానికి ఒక్క లారీ కేటాయించడంతో మూడు నుంచి నాలుగు రోజులకు ఒక్క లారీ కాళి అవుతే రైతులు ఆందోళన చేయరా? అని ప్రశ్నించారు. రైతుల పక్షాన లారీల కోసం అధికారులు, రైస్ మిల్లు చుట్టూ తిరిగినా సరైన స్పందన లేదన్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం జరిగిందని, తొందరలోనే వర్షాలు రానున్నందున అధికారులు పట్టింపు తీసుకొని లారీలు పంపించాలని కోరారు.