రోడ్డుపై రూ. 500 కోట్లు

రోడ్డుపై రూ. 500 కోట్లు

టీనగర్(చెన్నై): మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ తనిఖీల్లో రూ.570 కోట్ల నగదు పట్టుబడ్డ ఘటన మరవకముందే ఆదివారం మరొకటి వెలుగుచూసింది. రూ.500 కోట్ల నగదు తీసుకెళ్తున్న  రెండు కంటైనర్ లారీల్ని మదురై జిల్లా తిరుమంగళం  వద్ద టీ తాగేందుకు డ్రైవర్లు ఆపారు. అనంతరం లారీల్ని స్టార్ట్ చేయగా ఒకటి మొరాయించింది.

కంటైనర్లలో డబ్బు విషయం చుట్టుపక్కల వ్యాపించడంతో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. లారీలకు ఎస్కార్టుగా ఉన్న సీఐఎస్‌ఎఫ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ మణికంఠన్, పదిమంది కమాండో పోలీసులు జనాన్ని అదుపు చేసేందుకు తంటాలు పడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక డీఎస్పీ సిబ్బందితో అక్కడికి చేరుకుని భద్రత కల్పించారు.  ఈ డబ్బును ఆర్‌బీఐ మైసూరు నుంచి తిరువనంతపురానికి పంపిస్తోంది.