రోడ్డుపై వరి నాటు వేసి నిరసన తెలిపిన బిఎస్పి నాయకులు
రుద్రంగి ఆగస్టు 7 (జనం సాక్షి);
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఆదివారం బహుజన్ సమాజ్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు,వేములవాడ నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జి కాదాసు మహేందర్ ఆధ్వర్యంలో వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గుంతలు ఏర్పడి అస్త వస్థ్యంగా మారిన రోడ్డు పై వరి నాట్లు వేసి నిరసన తెలుపడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వేములవాడ నియోజకవర్గ శాసన సభ్యులు చేన్నమనేని రమేశ్ బాబు రుద్రంగి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని దత్తత తీసుకొని గ్రామంలోని సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం సరైంది కాదని అన్నారు.కోట్ల రూపాయలు వెచ్చించి అంబేద్కర్ విగ్రహం నుండి ఇందిరా చౌక్ వరకు రోడ్డు వేడెల్పు మరియు సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టి నాణ్యత లోపంతో పూర్తి చేసారు. ఆకరణంగా ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు మొత్తం ధ్వంసం అయి రోడ్డు పై గుంతలు ఏర్పడి అట్టి గుంతలలో వర్షపు నీరు నిలిచి వాహన దారులకు,ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది.ఇట్టి సమస్యకు కారణం కాంట్రాక్టర్ నాసి రకం మెటీరియల్ వాడడం దానిని అధికారులు గాని,ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం కారణమని ఇప్పటికైనా వేములవాడ శాసన సభ్యులు నిర్లక్ష్యపు నిద్రావస్థ నుండి మేల్కొని రోడ్డుని నాణ్యతతో మరమ్మత్తులు చేసి ఇట్టి సమస్యను పరిష్కరించాలని బహుజన్ సమాజ్ పార్టీ తరుపున డిమాండ్ చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దర్శనం గంగాధర్, వేములవాడ నియోజకవర్గ కోశాధికారి దయ్యాల ఉదయ్,మండల ప్రధాన కార్యదర్శి దేశవేణి బూమేష్, నాయకులు పూడూరి సత్య నారాయణ, మల్యాల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.