రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి
మంగపేట: మండలంలోని మల్లూరుకు చెందిన వీరగోని సాంబయ్య (40) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం సాంబయ్య కుమారుడు అవినాష్ కమలాపురంలో పదోతరగతి పరీక్షలు రాస్తున్నాడు. పరీక్షా కేంద్రాన్ని చూద్దామని తన భార్యతోపాటు సాంబయ్య బండిమీద వెళుతుండగా తుమ్మపేట మూల మలుపు వద్ద బండి అదుపు పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.