రోడ్డుప్రమాదంలో సాప్ట్వేర్ ఇంజనీర్ మృతి
ఘట్‌కేసర్(రంగారెడ్డి జిల్లా): వేగంగా వెళ్తున్న లారీ, బైక్‌ను ఢీ కొనడంతో సాప్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం యంనంపేట గ్రామసమీపంలో జరిగింది. వివరాలు..మల్కాజ్‌గిరికి చెందిన సతీష్ హబ్సీగూడలోని జెన్‌ప్యాక్‌లో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు.
కాగా, గురువారం బైక్‌పై వెళ్తుండగా కంటెనర్ లారీ ఎమ్‌ఎమ్‌పేట ప్లైఓవర్ బ్రిడ్జీ వద్ద ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.