రోడ్డు పక్కన గుంతను పూడ్చండి.. సారు…..

అక్కన్నపేట ఆగస్టు  (జనంసాక్షి) హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం మల్చెరువు తండా గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్డు పక్కన మట్టి కొట్టుకుపోయి గుంత ఏర్పడింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.హుస్నాబాద్ నుండి రేగొండ, నర్సింగ్ తండా, మల్చెరువు తండా మీదుగా ధర్మారం వెళ్లే ఈ రోడ్డు వెంబడి నిత్యం హుస్నాబాద్ కు రాకపోకలు కొనసాగిస్తుంటారు. పొలాల వద్దకు వెళ్లే రైతులు వేకువ జామునే వెళుతుంటారు. రాత్రిపూట కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వెంటనే సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే రోడ్డుకు మరమ్మతులు చేసి ప్రమాదాలు జరగకుం