రోడ్డు పైన ఏర్పడిన గుంతల వద్ద ప్రమాదం జరగకుండా బారికేడ్ ఏర్పాటు చేసిన చేవెళ్ల ట్రాఫిక్ సిఐ గురువయ్యగౌడ్.

,14 (జనం సాక్షి) : ఏడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు  రోడ్డు మీద  ప్రమాదకరంగా మారిన గుంతలు  ఏర్పడినవి ఈ గుంతల వలన వాహన దారులకి  ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి , చేవెళ్ల-షా బాద్   రహదారి పైన మల్లారెడ్డి గూడ గ్రామ గేట్  సమీపములో రోడ్డు పైన ఏర్పడిన గుంతల వద్ద ఏలాంటి ప్రమాదాలు జరగకుంట  చేవెళ్ల ట్రాఫిక్ పోలీసులు, సీఐ గురువయ్య గౌడ్ ఆధ్వర్యములో బారికెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సందర్భంగా సీఐ గురువయ్య గౌడ్ మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న సమయంలో అతివేగంగా వాహనాలు నడప వద్దు, రోడ్డు పైన ఏర్పడిన గుంతల్లో నీరు నిలిచి ఉండటం వలన వాహనాలు నడిపేవారికి  ఆగుంతలు కనపడవు కాబట్టి రోడ్డు మీద నీరు  నిలిచి ఉన్న చోట నిదానముగా   వెళ్ళండి, వర్షo వలన  రోడ్డు కూడా  తడిసి ఉంటుంది కాబట్టి వాహనాలు స్కిడ్ అయి క్రింద పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, మీకు ఏదైనా ప్రమాదం జరిగితే మీ కుటుంబ పరిస్థితి ఏమిటి అని ఒకసారి ఆలోచించి జాగ్రతగా వావనాలు నడపండి,  ట్రాఫిక్ రూల్స్ పాటించండి సురక్షితంగా మీ గమ్యం చేరండి అని వాహనదారులకు   చేవెళ్ల సీఐ గురువయ్యగౌడ్ ముందు జాగ్రత్తగా సూచనలు ఇవ్వడం జరిగింది.