రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలు
కొండపాక : మండలంలోని వెలికట్ట గ్రామ పంచాయతీ ఆరేపల్లి శివారులో రాజీవ్ రహదారిపై ఆటోను వెనక నుంచి డీసీఎం వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వరంగల్ జిల్లా చేర్యాలకు చెందిన ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని సిద్దిపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.