రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

నల్గొండ,మే19( జ‌నం సాక్షి ):  రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన నల్గొండ జిల్లా పెద్దవూర మండలం తుమ్మచెట్టు తండా వద్ద శనివారం ఉదయం జరిగింది. లారీ-బైక్‌ ఒకదానొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు అనుముల మండలం కొత్తపల్లికి చెందిన నిరంజన్‌(30), నాగరాజు(29)గా గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం సవిూపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరువెళుతున్న బైక్‌ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.