రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మెదక్‌,జూలై23(జ‌నంసాక్షి): మెదక్‌ జిల్లా సవిూపంలోని జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మృతులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్‌కు చెందిన శ్రీగదా సందీప్‌ (28), సూర్యతేజ (28)గా గుర్తించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.