రోడ్డు ప్రమాదంలో ఏదుట్ల వాసి సుంకరి విజయ్ మృతి భార్యకు తీవ్ర గాయాలు
మండలంలోని ఏదుట్ల గ్రామానికి చెందిన విజయ్ భార్య శివపార్వతి అలంపూర్ మాంటిసోరి హైస్కూల్ లో చదువు తున్న తమ పిల్లలను చూసేందుకు బైకుపై వెళ్లుతుండగా గద్వాల జిల్లా మానవ పాడు స్టేజీ వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీ కొన్న సంఘటన లో విజయ్ (45) అక్కడికక్కడే మృతి చెందగా భార్య శివ పార్వతి తీవ్రంగా గాయపడ్డారు. విజయ్ మృతి తో ఏదుట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు