రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి 

చిన్నకోడూర్, ఎప్రిల్ 30(జనంసాక్షి): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడిన  ఘటన మండల పరిధిలోని సంఘటన మండల పరిధిలోని రామునిపట్ల గ్రామ శివారులో జరిగింది. వివరాల్లోకి వెళితే… మండల పరిధిలోని ఇబ్రహింనగర్ గ్రామానికి చేందిన వంగాల ప్రభాకర్(48) రామునిపట్ల శివారు లోని పెట్రోలు బంకులో పెట్రోల్ పోసుకుని రాంగ్ రూట్ లో సిద్దిపేట వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో ఇబ్రహింనగర్ కు చెందిన రైతు నాయకం రామచంద్రం (60) బైకు పై గ్రామానికి వస్తున్న క్రమంలో పెట్రోలు బంకు సమీపంలో ఎదురుగా ఢీకొనగా ఇరువురు కింద పడిపోయారు. ఇదే సమయంలో వెనుక నుండి వస్తున్న లారి కింద పడిన నాయకం రామచంద్రంను ఢీకొట్టింది. దీంతో బలమైన గాయాలైన రామచంద్రం అక్కడిక్కడే మృతి చెందాడు. రోడ్డుకి అవుతలి వైపు పడిన ప్రభాకర్ గాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న చిన్నకోడూర్ ఎస్సై అశోక్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం సిద్దిపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు.