రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా మండలంలో బుధవారం అర్ధరాత్రి ఘోరా రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు సంజీవరావు, ఆయన భార్య దుర్మరణం చెందారు. వైరా పాత బస్టాండ్ వద్ద వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.