రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ములుగు మండలం నల్లంపల్లి గ్రామం వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒంటేరు దీప(25) అనే మహిళ మృతి చెందింది. టాటా ఏసీ వాహనంలో దీప అమె భర్త రమెష్ ములుగు నుంచి హన్మకోండ వైపు వస్తున్న లారీ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హన్మకోండ నుంచి ములుగ వైపు వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీ కోంది. ఈ ప్రమాదంలో దీప అక్కడికక్కడే మృతి చెందగా భర్త రమేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. పోలిసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.