రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

మెదక్‌, సెప్టెంబరు 8 : కొండపాక మండలం కుకునూరుపల్లి దగ్గర జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. రెండు కార్లు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.మృతుల్లో భరత్‌కుమార్‌, ప్రవీణ్‌కుమార్‌, విజ్జిలున్నారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.