రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి…

 

 

 

 

 

 

మాట ఇచ్చి పట్టించుకోని కేశవపట్నం ఎస్ ఐ చంద్రశేఖర్…మాట ఇచ్చి పట్టించుకోని కేశవపట్నం ఎస్ ఐ చంద్రశేఖర్…
శంకరపట్నంలో డిస్టిక్ గార్డులు ఉన్నతాధికారుల పర్యవేక్షణ…
శంకరపట్నం, జనంసాక్షి అక్టోబర్ 18రోడ్డు ప్రమాదంలో శంకరపట్నం మండలం ఎరడ పల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఈ నెల 17 రాత్రి మానకొండూర్ మండలం ఈదుల గట్టపెల్లి వంతెన వద్ద చోటుచేసుకుంది. గ్రామస్తులు బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన జాలిగం సంపత్, అతని కుమారుడైన జాలిగం శివ ఈ నెల 17న సాయంత్రం కరీంనగర్ పట్టణానికి వెళ్లి తండ్రి సంపత్ కొడుకు శివ ద్విచక్ర వాహనం పైన తిరిగి వస్తుండగా మార్గమధ్యంలోని మానకొండూర్ శివారులోని ఈదులగట్టే పల్లి వంతెన వద్ద కారు ఢీకొనగా తండ్రి సంపత్ కొడుకు శివ, రోడ్డుపై పడడంతో, కొడుకు శివకు బలమైన దెబ్బ తగిలి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న మానకొండూర్, కేశవవపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించగా, సంపత్, శివ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కేశవపట్నం ఎస్ఐ దేశ్ చంద్రశేఖర్ తండ్రికి చెందిన దిగా తెలియడంతో ఘటనా స్థలాల్లో ఉన్న కేశవపట్నం ఎస్ఐ దేశ్ చంద్రశేఖర్ మృతుడి తండ్రికి తన జిమ్మదారి అని హామీ ఇచ్చి, ఘటనా స్థలము నుండి గాయాలపాలైన తండ్రి సంపత్ ను మృతి చెందిన శివమృతదేహాన్ని తరలించినట్లు తెలిపారు. మంగళవారం బాధిత కుటుంబ సభ్యులు, ఎరడపల్లి గ్రామ సర్పంచ్ కలకుంట్ల రంజిత్ రావు ఎస్ ఐ దేశ్ చంద్ర శేఖర్ ను కలిసేందుకు సంప్రదించగా, అందుబాటులో లేకపోవడంతో, సెల్ఫోన్ ద్వారా సంప్రదించగా ఫలితం లేదని, దీంతో కుటుంబ సభ్యులు, శివ స్నేహితులు శివమృతదేహాన్ని కేశవపట్నం పోలీస్ స్టేషన్ ఎదుట వేసి నిరసన వ్యక్తం చేస్తారన్న సమాచారాన్ని తెలుసుకున్న, హుజురాబాద్ ఏసిపి కోట్ల వెంకటరెడ్డి, హుజురాబాద్ రూరల్ సిఐ జనార్ధన్, కేశవపట్నం పోలీస్ స్టేషన్ కు చేరుకొని, ఉన్నతాధికారులకు సమాచారం అందించి డిస్టిక్ కార్డు పోలీసులను రప్పించినట్లు మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక ఉన్నత స్థాయిలో ఉండి, బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాల్సిన ఎస్ ఐ హోదాలో ఉన్న ఎస్ ఐ దేశ్ చంద్రశేఖర్ వ్యవహార శైలిపై గ్రామ సర్పంచ్, గ్రామస్తులు, మండల ప్రజలు వివిధ రకాలుగా మాట్లాడుచున్నారు.