రోడ్డు భద్రత వారోత్సవాల ముగింపు

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిధి( ఏప్రిల్30)
               రోడ్డు భద్రత.వారోత్సవాల ముగింపు సందర్భంగా  పోలీసు-రవాణా శాఖలు సంయుక్తంగా చేపట్టిన  హెల్మెట్ అవగాహనా ర్యాలీని సిద్దిపేట్ ట్రాఫిక్ ఎసిపి బాలాజీ, అర్.టి.ఓ రామేశ్వర్ రెడ్డి అర్.టి.ఓ ఆఫీసు వద్ద  ప్రారంభించారు ఈ సందర్భంగా ఇద్దరు అధికారులు మాట్లాడుతూ
ద్విచక్ర వాహనాలు నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలన్న నిబంధన ప్రతి ఒక్కరూ పాటించాలని, అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తలకు గాయం తగలకుండా రక్షణ కల్పిస్తోందని తెలిపారు. మరియు అతివేగంగా వాహనాలు నడపవద్దని ప్రమాదాలు కోరి తెచ్చుకోవద్దని మీ పైన మీ కుటుంబము ఆధారపడి ఉందని తెలుసుకుని వాహనాలు నడపాలని సూచించారు. కుటుంబ యజమాని లేకపోతే కుటుంబం అదొగతి అవుతుందని తెలిపినారు. మరియు ఆటో డ్రైవర్లు ఆటోలను రోడ్డు నియమాలు పాటిస్తూ ఆటోలు నడపాలని ప్రతి డ్రైవర్ తప్పనిసరిగా డ్రైవింగ్  లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు కార్లు నడిపేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించలని హెల్మెట్ ధారణ ప్రాణానికి రక్ష అనుకుంటూ ర్యాలీ  నిర్వహించారు ఈ కార్యక్రమంలో అర్.టి.ఓ అధికారులు, సిద్దిపేట్ టూ టౌన్ సిఐ ఆంజనేయులు,అర్.టి.ఓ సిబ్బంది, మరియు. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.